నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది
సఖియా వివరించవే వగలెరిగిన
చెలునికి నా కధ..
చందన చర్చిత నీలకళేబర
పాడమని నన్నడగవలెనా
పరవశించి పాడనా
పాడవేల రాధికా ప్రణయసుధాగీతిక
నీవురావు నిదురరాదు నిలిచిపోయే ఈ రేయి..
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే..
కలనైన కనని ఆనందం
ఇలలోన విరిసే ఈనాడే..
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మోగింది వీణ పదేపదే హృదయాలలోన
ఆ దివ్య రాగం అనురాగమై పాడిందిలే..
మోగునా ఈ వీణా మూగవోయిన రాగ వీణ
అనురాగ వీణ మోగునా ఈ వీణ..
ఎవరోరావాలి నీ హృదయం కదిలించాలి
ఈ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి..
వీణలోనా తీగలోన ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనదీ రాగము
నీ దయ రాదా రామ నీదయ రాదా
సఖియా వివరించవే వగలెరిగిన
చెలునికి నా కధ..
చందన చర్చిత నీలకళేబర
పాడమని నన్నడగవలెనా
పరవశించి పాడనా
పాడవేల రాధికా ప్రణయసుధాగీతిక
నీవురావు నిదురరాదు నిలిచిపోయే ఈ రేయి..
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే..
కలనైన కనని ఆనందం
ఇలలోన విరిసే ఈనాడే..
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మోగింది వీణ పదేపదే హృదయాలలోన
ఆ దివ్య రాగం అనురాగమై పాడిందిలే..
మోగునా ఈ వీణా మూగవోయిన రాగ వీణ
అనురాగ వీణ మోగునా ఈ వీణ..
ఎవరోరావాలి నీ హృదయం కదిలించాలి
ఈ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి..
వీణలోనా తీగలోన ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనదీ రాగము
నీ దయ రాదా రామ నీదయ రాదా










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి