కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా
గోపెమ్మా సొగసరి గోపెమ్మా
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా
గోపెమ్మా సొగసరి గోపెమ్మా
చీర దొంగిలించి అయ్యో చిటారు కొమ్మన
ఉన్నావా .. దాగున్నావా
చీర తిరిగి ఇస్తేను చేతులెత్తి మొక్కేను
చీర దొంగిలించి అమ్మీ చిటారు కొమ్మన
ఉన్నాను .. దాగున్నాను
దోరవలపులందిస్తే చీర తిరిగి ఇస్తాను
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా
గోపెమ్మా సొగసరి గోపెమ్మా
వనవేణువు పలికించేవు అనురాగం
చిలికించేవు
వనవేణువు పలికించేవు అనురాగం
చిలికించేవు
మనసేమో కరిగించేవు నను నన్నే మరిపించేవు
నను నన్నే
మరిపించేవు
పగడాల పెదవులపైన జిగినవ్వులు మెరిపించేవు
ఉడుకెత్తే
వేసవిలోనే వడగళ్ళను కురిపించేవు
వడగళ్ళను కురిపించేవు
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా
గోపెమ్మా సొగసరి గోపెమ్మా
నడుము చూస్తే పిడికెడు పిడికెడు
నడక చూస్తే హంసలు తడబడు
సొగసు చూస్తే..ఊ ..చూస్తే?..హహహ మతిపోతుంది
సొగసు చూస్తె మతిపోతుంది నీ మనసిస్తే సరిపోతుంది
గోపెమ్మా సొగసరి గోపెమ్మా
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా
కన్నె మనసు నీ చేతికందెనని సన్నని నడుమే చెప్తుంది
కన్నె మనసు నీ చేతికందెనని సన్నని నడుమే చెప్తుంది
ఇచ్చిన మనసు తిరిగి రాదని పచ్చిక పానుపు పలికింది
ఈ పచ్చిక పానుపు పలికింది