Pages

30, ఏప్రిల్ 2020, గురువారం

నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే



నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే 
నా వేషాలన్నీ నీకొరకే



నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే 
నా వేషాలన్నీ నీకొరకే 
నా కొరకా నా కొరకా వేషాలన్నీ నా కొరకా 
నీ మోసాలన్నీ నా కొరకా 

 అడిగిన కోరిక తీరుస్తా నీ అందానికి నే పడిచస్తా 
తళతళ మెరిసే ప్రేమపూసలు 
దండగట్టి నీ మెళ్ళో వేస్తా 

నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే 
నా వేషాలన్నీ నీకొరకే

ఎర్రని ఏగాణీ ఎపుడైనా ఇచ్చిన మొగమేనా 
చీరలు తెచ్చిన మొగమేనా 
ఔనో కాదో కళ్ళు  తుడుచుకుని 
మొగము చూసుకో అద్దంలోనా 

నా కొరకా నా కొరకా వేషాలన్నీ నా కొరకా 
నీ మోసాలన్నీ నా కొరకా 

చిలకల కొలికి చిరాకుమాని కనికరించవే నా పైని 
నీ మనసు నిలపవే నా పైని 
నిలువున బంగరు తాడు వేయించి 
ఊరేగించెద నా రాణి 

ఓహో ఓహో ఓహో ఓహో ఓహో 

చాలుర మామా చాలు నీ నక్క వినయములు చాలు  
నీ టక్కరి కూతలు చాలు 
కల్లలు బొల్లలు దంచావంటే పళ్ళు పదారు రాలు 
నీ పళ్ళు పదారు రాలు 

ఇహీం ఇహీం ఇహీం ఇహీం 


చిత్రం - ఆడపెత్తనం (1958)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు 
గీతరచన - కొసరాజు 
గానం - ఘంటసాల,జిక్కి

28, ఏప్రిల్ 2020, మంగళవారం

టక్కరిదానా టెక్కులదానా



టక్కరిదానా టెక్కులదానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే



టక్కరిదానా టెక్కులదానా
టక్కరిదానా టెక్కులదానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే

తుంటరి రాజా తింటావు కాజా
తుంటరి రాజా తింటావు కాజా
వొంటిగ చేసీ కొంటెగ చూసీ వెంటపడతావా

మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
 మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
యిక బూటకమాడీ నాటకమాడే వాటము చాలోయీ
బూటకమాడీ నాటకమాడే వాటము చాలోయీ

తుంటరి తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు తింటావు కాజా
టక్కరి టక్కరి టక్కరి టక్కరి టక్కరిదానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కులదాన

చీరెలు యిస్తా సారెలు తెస్తా చిరుబురుమనకే
చీరెలు యిస్తా సారెలు తెస్తా చిరుబురుమనకే
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
 కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
 
టక్కరి టక్కరి టక్కరి టక్కరి టక్కరిదానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కులదాన

చీరెలు యేలా సారెలు యేలా బేరాల మాటేలా
 చీరెలు యేలా సారెలు యేలా బేరాల మాటేలా
నే కోరినవాడే చేరువకాగా కొరత యింకేలా
నే కోరినవాడే చేరువకాగా కొరత యింకేలా

తుంటరి తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు తింటావు కాజా

బూరెలు చేస్తా గారెలు చేస్తా బూందీ చేస్తానే
 బూరెలు చేస్తా గారెలు చేస్తా బూందీ చేస్తానే
వద్దన్నను మన పెళ్ళికి నేను వడ్డన చేస్తానే
వద్దన్నను మన పెళ్ళికి నేను వడ్డన చేస్తానే

టక్కరిదానా టెక్కులదానా చుక్కలకన్నా
చక్కనిదానా చిక్కాను నీకేనే


చిత్రం - విమల  (1960)
సంగీతం - ఎస్ ఎమ్ సుబ్బయ్యనాయుడు
రచన - ముద్దుకృష్ణ
గానం - పిఠాపురం నాగేశ్వరరావు,జమునారాణి


26, ఏప్రిల్ 2020, ఆదివారం

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే



వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ ఉన్నా దానివే



వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే

తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
కళ్ళెంపట్టీ .. కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి
నడిపే మొనగాడుండాలీ

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే

అందనిదైనా గాని నరులందరు కోరుదురందాన్ని
అందనిదైనా గాని నరులందరు కోరుదురందాన్ని
తూకంవేసీ.. తూకంవేసి.. పాకంచూసి
డెందం ఒకరికె ఇవ్వాలి

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే

అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే
అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే
అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ ఉన్నా జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే 


చిత్రం - వాగ్ధానం (1961)
సంగీతం - పెండ్యాల
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - ఘంటసాల 

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

బంగరు నావ బ్రతుకు బంగరు నావ



బంగరు నావ బ్రతుకు బంగరు నావ
దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవా



బంగరు నావ బ్రతుకు బంగరు నావా
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ బ్రతుకు బంగరు నావా

బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ

అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
కదలిపోవు కాలచక్రమాగిపోవునా

నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావా .. బ్రతుకు బంగరు నావా

అనురాగం వెన్నెలలు అంతరించినా
అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్ని త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి ప్రేమించుటకే
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ

బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావా .. బ్రతుకు బంగరు నావా

కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
వలపన్నది విఫలమై విలపించుటకా
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా

నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా
బంగరు నావ ..   బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ .. బ్రతుకు బంగరు నావ


చిత్రం - వాగ్ధానం (1961)
సంగీతం - పెండ్యాల
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం  - సుశీల

22, ఏప్రిల్ 2020, బుధవారం

నేడు శ్రీవారికి మేమంటే పరాకా



నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకా



నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా .. ఎందుకో తగని బలే చిరాకా
నేడు శ్రీవారికి మేమంటే పరాకా

మొదలు మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళీకాగానే చేస్తారు మోసం
ఆ..ఆ.. ఆడవారంటే శాంత స్వరూపాలే
కోపతాపాలే రావండి పాపం

కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు

నేడు శ్రీమతికి మా తోటి వివాదం
తగువే భలే వినోదం ఎందుకో.. తగువే లే వినోదం
నేడు శ్రీమతికి మా తోటి వివాదం

వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
ఆ..ఆ.. తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు

అలుక సరదా మీకు అదే వేడుక మాకు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే

ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే.. లే వినోదం..ఆ...నిజమే లే వినోదం
ఆ.. నిజమే.. లే వినోదం


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల 

20, ఏప్రిల్ 2020, సోమవారం

చేతులు కలిసిన చప్పట్లూ



చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు




చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

పాలూ తేనె కలిసిన మాదిరి 
ఆలు మగలు ఉండాలి
పాలూ తేనె కలిసిన మాదిరి 
ఆలు మగలు ఉండాలి

గువ్వల జంట కులికే రీతిగ
నవ్వుల పంట పండాలీ 
నవ్వుల పంట పండాలీ

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

కొత్త కుండలో నీరు తియ్యన 
కోరిన మగవాడే తియ్యన
కొత్త కుండలో నీరు తియ్యన 
కోరిన మగవాడే తియ్యన

కొత్త కాపురం చక్కని వరము 
కోరిక తీరు రయ్ రయ్యన

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

వన్నెల చిన్నెల వలపు తోటలో 
పూల బాటలే వెయ్యాలి
వన్నెల చిన్నెల వలపు తోటలో 
పూల బాటలే వెయ్యాలి

అన్యోన్యంగా దంపతులెపుడు
కన్నుల పండుగ చేయాలీ 
కన్నుల పండుగ చేయాలీ

చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ 
మనసులు కలిసిన ముచ్చట్లు

ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు .. రానే రావు పొరపాట్లు


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - ఆరుద్ర 
గానం - ఘంటసాల,మాధవపెద్ది సత్యం,సుశీల

18, ఏప్రిల్ 2020, శనివారం

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి



అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా



అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
అడిగిందానికి చెబుతా ఎంతైనా పందెం గడతా
నిల్చెదనోయి గెల్చెదనోయి ఓహో చిన్నవాడా

ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
గుట్టుగ తన పని సాధించునది .. వివరిస్తావా ఏదది?

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా

ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
కొంగ జపమని ప్రసిద్ధియేను .. ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్‌ గెల్చెదమోయ్‌ ఓహో చిన్నవాడా

వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
గడియలోననే ఉన్న చోటకే వడిగా చేరేదేదది

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా

రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను
రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను
ముమ్మాటికి అది మనసేను ఇక.. ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్‌ గెల్చెదమోయ్‌ ఓహో చిన్నవాడా

దానమిచ్చి చెడె నెవ్వడు
కర్ణుడు... కర్ణుడు
తప్పు తప్పు బలి చక్రవర్తి .. హేయ్‌ బలిచక్రవర్తి
జూదానికి నిపుణుండెవ్వడు
ధర్మజుడు... ధర్మజుడు
తప్పు తప్పు శకుని.. హేయ్‌ శకుని

అన్నదమ్ముల పోరాటంలో సందు చూచుకుని కూల్చిందెవడు
భీముడు... భీముడు
తప్పు తప్పు రాముడు
హేయ్‌ రాముడు.. శ్రీరాముడు.. శ్రీ రాముడు


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల

16, ఏప్రిల్ 2020, గురువారం

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌



ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు



ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకే
పొదలలో పూ పొదలలో పొంచినా గాలించినా
పొదలలో పూ పొదలలో పొంచినా గాలించినా
కనులకు నే కనిపించనులే

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

నీడలో దోబూచిగా ఆడకే తారాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
దాగుడు మూతలు చాలునులే

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

వెదికినా నే దొరకనే పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
ఎన్నటికీ నిను వీడనులే

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - శ్రీశ్రీ
గానం - ఘంటసాల

14, ఏప్రిల్ 2020, మంగళవారం

నిలువవే వాలు కనులదానా



నిలువవే వాలు కనులదానా 
వయ్యారి హంస నడకదానా



నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా
నీ నడకలొ హోయలున్నవే తానా
నువ్వు కులుకుతు  ఘలఘల నడుస్తూ ఉంటే
నిలువదె  నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు

నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా
నీ నడకలొ హోయలున్నవే తానా

ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతిపడినావో
ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో
సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నను తోసిపోయేవో

నువ్వు కులుకుతు  ఘల ఘల నడుస్తు ఉంటే
నిలువదె  నా మనసు ఓ లలనా.. అది నీకే తెలుసు

ఒకసారి నన్ను చూడరాదా చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా
వగలాడి నే నీవాడనే కాదా

నువ్వు కులుకుతు  ఘలఘల నడుస్తు  ఉంటే
నిలువదె  నా మనసు ఓ లలనా.. అది నీకే తెలుసు

మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా
కోపమా నా పైనా .. నీ నోటి మాటకే నోచుకోలేనా

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలొ  హొయలున్నవే తానా 

నువ్వు కులుకుతు  ఘలఘల నడుస్తు ఉంటే
నిలువదె నా మనసు
ఓ చెలియా.. ఓ మగువా.. ఓ.. లలనా అది నీకే తెలుసు 


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల 


12, ఏప్రిల్ 2020, ఆదివారం

భలేఛాన్సులే లలలాం లలలాం లక్కీఛాన్సులే



ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే .. భలేఛాన్సులే



భలేఛాన్సులే భలేఛాన్సులే భలేఛాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే భలేఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే .. భలేఛాన్సులే

అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
బావమరుదులే లేకుంటే ఇక అల్లుడుదేలే అధికారం
భలేఛాన్సులే

గంజిపోసినా అమృతంలాగా కమ్మగ ఉందనుకుంటే
బహు కమ్మగ ఉందనుకుంటే
చీ ఛా చీ ఛా అన్న చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి .. భలేఛాన్సులే

ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే భలేఛాన్సులే

జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడి
జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడి
దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచేవాడికి

భలేఛాన్సులే భలేఛాన్సులే భలేఛాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే భలేఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవించితే తెలియునిలే

అణిగిమణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
అణిగిమణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
మామ లోభియై కూడబెట్టితే మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది ఇహ మనకే కాదా దక్కేది

అది మనకే ఇహ మనకే అది మనకే
మనకే,మనకే మ మ మ మనకే


చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతి రావు 
గీతరచన - కొసరాజు 
గానం - మాధవపెద్ది సత్యం

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

సరదా సరదా సిగిరెట్టూ




సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ



సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

పట్టుబట్టి ఒక దమ్ము లాగితే
స్వర్గానికె యిది తొలి మెట్టు
సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు  
కడుపు నిండునా కాలు నిండునా వదలి పెట్టవోయ్ నీ పట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ లంకా దహనం చేశాడూ
హా.. ఎవడో కోతలు కోశాడూ  
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ
మీసాలు కాల్చుకోవచ్చూ

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

ఊపిరి తిత్తులు క్యాన్సరు కిదియే కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ 
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ

కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకు ముక్కు ఎగరేస్తారు
నీవెరుగవు దీని హుషారు
థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించినారందుకే
కలెక్షన్లు లేవందుకే

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

కవిత్వానికి సిగిరెట్టు కాఫీకే యిది తోబుట్టు
పైత్యానికి యీ సిగిరెట్టు బడాయి క్రిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు ఆలోచనలను గిలకొట్టు
వాహ్..పనిలేకుంటే సిగిరెట్టూ తిని కూర్చుంటే పొగపట్టూ

రవ్వలు రాల్చే రాకెట్టూ రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు


చిత్రం - రాముడు-భీముడు(1964)
సంగీతం - పెండ్యాల
గీతరచన - కొసరాజు
గానం - మాధవపెద్ది ,జమునారాణి 

8, ఏప్రిల్ 2020, బుధవారం

తగునా ఇది మామా




తగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామా



తగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామా
నిగమ మార్గములు తెలిసిన నీవే ఇటులనదగునా
తగునా ఇది మామా 

అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ 
అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ 
నీవు కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన ఘనుడు 
ఆ ఘనుని మీద అలుక బూన ఏటికి చీటికి మాటికి 

తగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామా 

పో .. పోర  పొమ్మికన్  పోపోర  పొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు 
ఇక రా వలదు రా తగదు .. ఛీ పో  పో 
పో .. పోర  పొమ్మికన్

అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర 
అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర 
నీ సాహసము పరీహాసము నీ సాహసము పరీహాసము 
నిర్భాగ్యుల తోటి సహవాసము సహించను క్షమించను
యోచించను నీ మాటన్ వచ్చిన బాటన్ పట్టుము వేగన్ 

పో .. పోర  పొమ్మికన్  పోపోర  పొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు 
ఇక రా వలదు రా తగదు .. ఛీ పో  పో 

కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే
కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే
నీకు కొరివి బెట్టువాడనే డైరెక్టుగ స్వర్గానికి 
చీటి నిచ్చువాడనే 
తల్లి లేని పిల్ల ఉసురు తగలదె ఒంటిగ ఉంచగ 

తగునా ఇది మామా తమరే ఇటు బల్క నగున 
తగునా ఇది మామా

 ఊరికెల్ల మొనగాడినే అరె... ఊరికెల్ల మొనగాడినే
పెద్ద మిల్లు కెల్ల యజమానినే
నీ డాబూసరి బలే బిత్తరి నీ డాబూసరి బలే బిత్తరి
నిజమేనని నమ్మితి పోకిరి 

దురాత్ముడా.. దుష్టాత్ముడా..గర్వాత్ముడా..  నీచుడా 
ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్
పో .. పోర  పొమ్మికన్  పోపోర  పొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు 
ఇక రా వలదు రా తగదు .. ఛీ పో  పో 


చిత్రం - రాముడు-భీముడు (1964) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన -  కొసరాజు 
గానం - ఘంటసాల, మాధవపెద్ది 

6, ఏప్రిల్ 2020, సోమవారం

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్






దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్



దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

కొండలు కొట్టి.. కొట్టి డ్యాములు కట్టీ.. కట్టి
నీళ్ళను మలిపి... మలిపి చేలను తడిపి... తడిపి
మురిసే చక్కని రోజు మనకు వస్తుందోయ్ వస్తుంది

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

కండల్ని కరగదీయి బండల్ని విసరివెయ్యి 
నీదేలె పైచేయీ 
కండల్ని కరగదీయి బండల్ని విసరివెయ్యి
నీదేలె పైచేయీ

భాగ్యాలు పండునోయి వాకళ్ళు నిండునోయి
భాగ్యాలు పండునోయి వాకళ్ళు నిండునోయి
సిరులు చిందునోయి ఆశలు అందునోయి
సిరులు చిందునోయి ఆశలు అందునోయి

చేయి చేయి కలపాలి రావయా  బావయ్యా

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్

గ్రామాల బాగుచెయ్యి దీపాల వెలుగునియ్యి
జేజేలు నీకోయీ 
గ్రామాల బాగుచెయ్యి దీపాల వెలుగునియ్యి
జేజేలు నీకోయీ 

చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టు
ఎందరో తమ రక్తాన్ని చిందించిరి
ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే
త్యాగమంటె ఇదే ఇదే.. ఇదే ఇదే ఇదే ఇదే
ఐకమత్యమిదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే

అనుభవమ్ము నీదేనోయి  ఆనందం నీదేనోయి
అనుభవమ్ము నీదేనోయి  ఆనందం నీదేనోయి
నిజమౌ శ్రమజీవివంటే  నీవెనోయ్ నీవేనోయ్

దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్


చిత్రం - రాముడు-భీముడు (1964)
సంగీతం - పెండ్యాల
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల


4, ఏప్రిల్ 2020, శనివారం

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం



దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం



దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 

మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు 
ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు 
ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 

పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు 
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు 
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు 
 బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు 

బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక 
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక 
నరుడే ఈ నరలోకం నరకం చేశాడు 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం

తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ 
తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ 
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ 
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ 

నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది 
నేనేడిస్తే ఈ లోకం చూసి చూసి నవ్వింది 

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం 
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం 
దేవుడనేవాడున్నాడా.... 


చిత్రం - దాగుడుమూతలు (1964) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, సుశీల

2, ఏప్రిల్ 2020, గురువారం

నీకూ నాకూ పెళ్ళంటే నింగీ నేలా మురిశాయీ




నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ



నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ

నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ

కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ 
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ
కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ

తెలిసింది నీ ఎత్తూ ఆ ఎత్తే గమ్మత్తూ
తెలిసింది నీ ఎత్తూ  ఆ ఎత్తే గమ్మత్తూ
సందెలో విందులా .. విందులో ..  పొందులా  
అలా.. అలా.. అలా.. అలా

నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ

ఏడడుగులు నడిచావంటే  ఎండ మొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను
ఏడడుగులు నడిచావంటే  ఎండ మొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను

నాలోనే వేడుందీ ..  నీ ధోరణి బావుంది
నాలోనే వేడుందీ ..  నీ ధోరణి బావుంది
ఎండలో .. వానలా .. వానలో .. హాయిలా  
అలా.. అలా.. అలా.. అలా
  
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ

మూడు ముళ్ళూ వేయకముందే నన్నల్లరి చెయ్యొద్దూ 
ఇల్లాలివి కావాలంటే ఇవ్వాలి తొలిముద్దూ
ఏమిటి ఈ చిలిపితనం .. అంతేలే కుర్రతనం
పూవులో .. తేటిలా .. తేటిలో .. పాటలా  
అలా.. అలా.. అలా.. అలా 

నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటే  నింగీ నేలా మురిశాయీ


చిత్రం - దొరబాబు (1974)
సంగీతం - జె.వి. రాఘవులు
గీతరచన - ఆంజనేయశాస్త్రి
గానం - రామకృష్ణ, సుశీల

ఆపాత మధురాలు

అంతస్తులు (1965) అంతా మన మంచికే (1972) అందమే ఆనందం... అందాలరాముడు (1973) అక్కాచెల్లెలు (1970) అగ్గి పిడుగు (1964) అగ్గి బరాట (1966) అగ్గిదొర (1967) అగ్గిరాముడు(1954) అడుగు జాడలు (1966) అత్తలు-కోడళ్లు (1972) అదృష్ట జాతకుడు (1971) అదృష్టవంతులు (1969) అనార్కలి (1955) అనురాగం (1963) అన్న - తమ్ముడు(1958) అన్నపూర్ణ (1960) అప్పుచేసి పప్పుకూడు(1959) అబ్బాయిగారు అమ్మాయిగారు (1972) అభిమానం (1960 ) అభిమానవంతులు (1973) అమరశిల్పి జక్కన్న(1964) అమాయకుడు (1968) అమాయకురాలు (1971) అమ్మ పాటలు అమ్మ మాట (1972) అమ్మాయి పెళ్లి (1974) అమ్మాయిల శపథం (1975) అర్థాంగి (1955) అల్లరిపిల్లలు (1978) అల్లూరి సీతారామరాజు (1974) అవేకళ్లు (1967) అసాధ్యుడు (1968) ఆడపడుచు(1967) ఆడబ్రతుకు (1965) ఆత్మ బంధువు (1962) ఆత్మగౌరవం (1966) ఆత్మబలం (1964) ఆత్మీయులు (1969) ఆదర్శ కుటుంబం (1969) ఆనంద నిలయం(1971) ఆరాధన (1962) ఆరాధన (1976) ఆలీబాబా 40 దొంగలు (1970) ఆలుమగలు (1977 ) ఆస్తిపరులు (1966) ఇంటికి దీపం ఇల్లాలే (1961) ఇంటిగుట్టు (1958) ఇండియా ఇదా లోకం (1973) ఇద్దరు పెళ్ళాలు(1954) ఇద్దరు మిత్రులు (1961) ఇద్దరు మొనగాళ్ళు (1966) ఇన్ స్పెక్టర్ భార్య (1970) ఇలవేల్పు (1956) ఇల్లరికం (1959) ఇల్లు-ఇల్లాలు (1972) ఈడు - జోడు (1963)ఇదేమి లాహిరి...ఇదేమి గారడి ఉండమ్మా బొట్టు పెడతా (1968) ఉమా చండి గౌరి శంకరుల కథ (1968) ఉమ్మడి కుటుంబం (1967) ఉయ్యాలా జంపాలా (1960) ఉషా పరిణయం (1961) ఋణానుబంధం (1960) ఎం.ఎల్.ఎ. (1957) ఎదురీత (1977) ఏకవీర (1969) ఒకే కుటుంబం (1970) ఓ సీత కథ (1974) ఓల్డ్ మెలోడీస్ కంచుకోట (1961) కథానాయకుడు (1969) కదలడు వదలడు (1969) కధానాయకురాలు(1971) కనకదుర్గ పూజా మహిమ (1960) కన్నతల్లి(1972) కన్నవారి కలలు (1974) కన్నె మనసులు (1966) కన్నె వయసు (1973) కన్యాశుల్కం(1955) కర్ణ (1964) కలసి ఉంటే కలదు సుఖం (1961) కలిమిలేములు (1962) కలిసిన మనసులు (1968) కళ్యాణ మంటపం (1971) కానిస్టేబుల్ కూతురు (1962) కార్తవరాయుని కథ (1958) కార్తీకమాసం - 2015 కాళహస్తి మహత్యం (1954) కీలుగుఱ్ఱం (1949) కుంకుమరేఖ(1960) కుటుంబగౌరవం (1957) కులగోత్రాలు (1962) కులగౌరవం (1972) కులదైవం (1960) కృష్ణ పాటలు కృష్ణకుమారి కెప్టెన్ కృష్ణ (1979) కొండవీటి సింహం (1981) కొడుకు-కోడలు (1972) కోడలు దిద్దిన కాపురం (1970) ఖైదీ కన్నయ్య(1962) గంగ - మంగ (1973) గండికోట రహస్యం (1969) గాజుల క్రిష్ణయ్య (1975) గాలి మేడలు (1962) గీత (1973) గుండమ్మ కథ (1962) గుడిగంటలు (1965) గుణసుందరి కధ (1949) గురువును మించిన శిష్యుడు (1963) గులేబకావళి కథ (1962) గూడుపుఠాణీ (1972) గూఢచారి 116 (1966) గోపాలుడు భూపాలుడు (1967) గోవుల గోపన్న (1968) ఘంటసాల ఘంటసాల - హిట్ సాంగ్స్ చండీరాణి (1953) చందమామ పాటలు చంద్రహారం(1954) చక్రవాకం (1974) చదువు సంస్కారం (1974) చదువుకున్న అమ్మాయిలు (1963) చరణదాసి (1956) చాణక్య చంద్రగుప్త (1977) చింతామణి (1956) చిక్కడు దొరకడు (1967) చిట్టి చెల్లెల్లు (1970) చిట్టితల్లి (1972) చిన్ననాటి కలలు (1975) చిన్ననాటి స్నేహితులు (1971) చిన్నపిల్లల పాటలు చిరంజీవులు(1956) చిల్లరదేవుళ్ళు (1977) చీకటి వెలుగులు (1975) చెంచులక్ష్మి (1958) చెల్లెలి కాపురం (1971) చైర్మన్ చలమయ్య (1974) జగత్ కిలాడీలు (1969) జగదేకవీరుని కధ (1961) జగ్గయ్య జమిందారు (1966) జమీందారు గారి అమ్మాయి (1975) జమున జయం మనదే (1956) జయభేరి (1959) జయసింహ(1955) జరిగిన కధ (1969) జీవన జ్యోతి (1975) జీవనతరంగాలు (1973) జీవిత చక్రం (1971) జీవిత నౌక (1977) జీవితం (1950) జీవితంలో వసంతం (1977) జేబు దొంగ (1975) జై జవాన్ (1970) జోలపాటలు జ్వాలాదీప రహస్యం (1965) టక్కరి దొంగ చక్కని చుక్క (1969) డబ్బుకు లోకం దాసోహం (1973) డాక్టర్ ఆనంద్ (1966) డాక్టర్ చక్రవర్తి (1964) డాక్టర్ బాబు (1973) తల్లా? పెళ్ళామా? (1970) తల్లిదండ్రులు (1970) తల్లిప్రేమ(1968) తాతా మనవడు (1973) తిక్క శంకరయ్య (1968) తులసి (1974) తులాభారం(1974) తెనాలి రామకృష్ణ (1956) తేనెమనసులు(1965) తోట రాముడు 1975 తోడికోడళ్ళు (1957) తోడూ నీడ (1965). తోబుట్టువులు(1963) దక్షయజ్ఞం (1962) దత్త పుత్రుడు (1972) దసరా బుల్లోడు (1971) దాగుడుమూతలు (1964) దీక్ష (1974) - మెరిసే మేఘ మాలికా దీపావళి (1960) దీపావళి శుభాకాంక్షలు దేవత(1964) దేవదాసు దేవదాసు (1953) దేవదాసు (1974) దేవుడు చేసిన మనుషులు(1973) దేశద్రోహులు (1964) దేశభక్తి గీతాలు దొంగరాముడు (1955) దొరబాబు (1974) దొరికితే దొంగలు (1965) ధనమా? దైవమా?(1973) నమ్మిన బంటు (1960) నర్తనశాల (1963) నవరాత్రి (1966) నా ఇల్లు (1953 ) నాగులచవితి (1956) నాటకాల రాయుడు (1969) నాదీ ఆడజన్మే (1965) నిండు సంసారం (1968) నిండు హృదయాలు (1969) నిత్యకళ్యాణం పచ్చతోరణం (1960) నిన్నే పెళ్ళాడతా (1968) నిర్దోషి (1967) నీడలేని ఆడది (1974) నీలి మేఘమాలవో ... నీలాలతారవో నీలిమేఘాలలో ... గాలి కెరటాలలో నేనంటే నేనే (1968) నేను నా దేశం (1974) నేనూ మనిషినే (1971) నేరం నాది కాదు ఆకలిది (1976) పండంటి కాపురం (1972) పండుగలు-శుభాకాంక్షలు పగబట్టిన పడుచు (1971) పరమానందయ్య శిష్యుల కథ (1966) పరువు ప్రతిష్ట (1963) పల్లెటూరు (1952) పవిత్ర బంధం (1971) పసి హృదయాలు (1973) పసిడి మనసులు (1970) పాండవ వనవాసం పాండవ వనవాసం (1965) పాండురంగ మహత్యం (1957) పాడిపంటలు (1976) పాతాళభైరవి (1951) పాల మనసులు (1968) పి. బి. శ్రీనివాస్ పిచ్చి పుల్లయ్య (1953) పిడుగు రాముడు (1966) పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973) పుణ్యవతి (1967) పునర్జన్మ (1963) పూజాఫలం (1964) పూలరంగడు (1967) పెద్దన్నయ్య (1975) పెళ్లి కానుక (1960) పెళ్లినాటి ప్రమాణాలు (1958) పెళ్లినాటి ప్రమాణాలు (1959) పెళ్ళి చేసి చూడు (1952) పెళ్ళి రోజు (1968) పెళ్ళి సందడి (1959) ప్రతిఙ్ఞా పాలన (1965) ప్రాణమిత్రులు (1967) ప్రేమ జీవులు (1971) ప్రేమకానుక (1969) ప్రేమనగర్(1971) ప్రేమలు పెళ్ళిళ్ళు (1974) ప్రేమలేఖలు (1953) ప్రేమించి చూడు (1965) బంగారు కలలు (1974) బంగారు గాజులు (1968) బంగారు తిమ్మరాజు (1964) బంగారు పంజరం (1969) బంగారు పాప (1954) బంగారు పిచుక ( 1968 ) బంగారు బాబు (1973) బంగారు బొమ్మలు (1977) బండరాముడు (1959) బందిపోటు (1963) బందిపోటు దొంగలు (1968) బడి పంతులు (1972) బలిపీఠం (1975) బాంధవ్యాలు (1968) బాటసారి ( 1961) బాలనాగమ్మ(1959) బాలమిత్రుల కథ (1972) బాలరాజు కధ(1970) బావమరదళ్ళు (1960) బుద్ధిమంతుడు(1969) బుల్లెమ్మ బుల్లోడు (1972) బొబ్బిలి యుద్ధం (1964) బ్రతుకుతెరువు (1953) భక్త కన్నప్ప (1976) భక్త జయదేవ (1961) భక్త తుకారాం (1973) భక్త మార్కండేయ - 1956 భట్టి విక్రమార్క (1961) భలే అమ్మాయిలు (1957) భలే తమ్ముడు (1969) భలే రంగడు (1969) భలే రాముడు (1956) భాగ్య చక్రం (1968) భాగ్యదేవత(1959) భాగ్యరేఖ (1957) భానుమతి hits భార్యా బిడ్డలు (1971) భార్యా భర్తలు (1961) భీష్మ ( 1962) భూ కైలాస్ - (1958) మంగమ్మ శపధం(1965) మంచి కుటుంబం (1967) మంచి మనసుకు మంచి రోజులు(1958) మంచి మనసులు (1962) మంచి మనిషి (1964) మంచి మనుషులు (1974) మంచి మిత్రులు (1969) మంచి-చెడు (1963) మంచిరోజులు వచ్చాయి (1972) మంచివాడు (1974) మగాడు (1976) మట్టిలో మాణిక్యం (1971) మధురభావాల సుమమాలా మన ఊరి కథ (1976) మనదేశం (1949) మనసు- మాంగల్యం (1970) మనసే మందిరం(1966) మనుషులంతా ఒక్కటే (1976) మనుషులు - మట్టిబొమ్మలు (1974) మనుషులు మమతలు (1965) మనుషులు మారాలి (1969) మనుషుల్లో దేవుడు (1974) మబ్బులో ఏముంది? ... నా మనసులో ఏముంది..? మర్మయోగి(1951) మల్లీశ్వరి ( 1951 ) మహాకవి కాళిదాసు (1960) మహాకవి క్షేత్రయ్య (1976) మహానటి సావిత్రి మహాబలుడు (1969) మహామంత్రి తిమ్మరుసు (1962) మా ఇద్దరి కథ (1977) మా దైవం (1976) మా నాన్న నిర్దోషి (1970) మాంగల్య బలం (1958) మాతృదేవత ( 1969) మాతృమూర్తి (1972) మానవుడు..దానవుడు -1972 మాయదారి మల్లిగాడు (1973) మాయని మమత (1970) మాయలమారి (1951) మాయాబజార్ (1957) మిస్సమ్మ (1955) మీనా (1973) ముందడుగు (1958) ముత్యాల పల్లకి (1976) ముద్దుబిడ్డ (1956) మురళీ కృష్ణ (1964) మురిపించే మువ్వలు (1962) మూగ ప్రేమ (1976) మూగ మనసులు (1963) మూగనోము (1969) మేనకోడలు (1972) మేమూ మనుషులమే (1973) మేలుకొలుపు (1978) మైనరు బాబు (1973) రంగుల మాయాబజార్.. రంగులరాట్నం (1966) రక్షాబంధన్ పాటలు రహస్యం (1967) రాజకోట రహస్యం (1971) రాజమకుటం ( 1961) రాజా రమేష్ (1977) రాజు పేద (1954) రాణీ రత్నప్రభ (1955) రాధా జయలక్ష్మి రాముడు భీముడు (1964) రూపవతి(1951) రేచుక్క (1955) రోజులు మారాయి (1955) లంబాడోళ్ల రామదాసు (1978) లక్ష్మమ్మ (1950) లేతమనసులు 1966 వద్దంటే డబ్బు(1954) వరకట్నం(1969) వసంతసేన (1967) వాగ్ధానం (1961) వాణిశ్రీ వారసత్వం (1964) విచిత్ర దాంపత్యం(1971) విచిత్ర బంధం (1972) విజయనిర్మల వినాయక విజయం వినాయకచవితి (1957) విమల (1960) వీరకంకణం(1957) వీరాభిమన్యు (1965) వెలుగు నీడలు (1961) శభాష్ రాముడు(1959) శభాష్ సూరి (1964) శాంతినివాసం (1960) శారద (1973) శోభన్ బాబు శ్రీ కృష్ణ విజయం (1970) శ్రీ తిరుపతమ్మ కథ (1963) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 శ్రీ రామాంజనేయ యుద్ధం శ్రీ వినాయక విజయం(1979) శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960) శ్రీ శ్రీ శ్రీకృష్ణ తులాభారం (1966) శ్రీకృష్ణ పాండవీయం (1966) శ్రీదేవి (1970) శ్రీమంతుడు (1971) శ్రీరామనవమి పాటలు శ్రీవారు మావారు (1973) షావుకారు (1950) సంక్రాంతి పాటలు సంగీతలక్ష్మి (1966) సంఘం (1954) సంతానం (1955) సంతోషం (1955) సందేశాత్మక గీతాలు సంపూర్ణ రామాయణం(1971) సంసారం ((1950) సంసారం ((1975) సతీ అనసూయ (1971) సతీ సక్కుబాయి (1965) సత్తెకాలపు సత్తయ్య (1969) సత్య హరిశ్చంద్ర (1965) సప్తస్వరాలు (1969) సాక్షి (1967) సావిత్రి Best Songs సిరి సంపదలు (1962) సీతారామ కల్యాణం (1961) సుఖదుఃఖాలు (1968) సుపుత్రుడు (1971) సుమంగళి (1965) సువర్ణ సుందరి (1957) సెక్రటరీ(1976) స్వప్న సుందరి (1950) A.N.R Actor - రేలంగి ANR - వాణిశ్రీ Director - బాపు Hero - కృష్ణ Hero - కృష్ణ - విజయనిర్మల Hero - శోభన్ బాబు Hero - ANR Hero - NTR Heroine - జయలలిత Heroine - భానుమతి Heroine - విజయనిర్మల NTR - New songs NTR - songs P.సుశీల savitri Side Actors Songs Women's Day - మహిళా గీతాలు

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...