అధ్బుతం అనేమాటకు అసలైన నిర్వచనంగా నిలిచిన సినిమా మాయాబజార్..తెలుగు చిత్రాలలో తలమానికంగా నిలబడిన ‘మాయాబజార్’...
పాండవులు కనిపించని మహాభారత కథగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు దర్శకులు కె.వి.రెడ్డి. పాండవులు లేని మహాభారతం ఎలా అనుకున్నా కాని ఈ చిత్రం మొదటినుంచి చివరిదాకా మంచి స్క్రీన్‌ప్లేతో పాండవులు లేని లోటును కనిపించకుండా సాగుతుంది.
అప్పటి వారందరినీ అద్భుతమైన అందచందాలు,వింతలతో అలరించిన ఈ సినిమా ఇప్పుడు రంగుల్లో మరింత అందంగా ఆకట్టుకుంది.మాయాబజార్ ను రంగుల్లో మార్చిన తర్వాత నాకు నచ్చింది శశిరేఖగా సావిత్రి అందం..అప్పటి నలుపు తెలుపులో చూసిన ప్రేక్షకులకు దక్కని అదృష్టం ఇప్పుడు మనకి దక్కిందని చెప్పొచ్చు.మాయాబజార్ గొప్ప వెండితెర సుందర స్వప్నం..
చక చక్కని జోస్యం చెబుతాము..
నీవేనా నను పిలిచినది నీవేనా నను తలచినది..
నీవేనా నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది..
చూపులు కలిసిన శుభవేళ..ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ పరవశము
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా..
ఆహా నా పెళ్ళియంట ఓహో నా పెళ్ళియంట..
ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట .
నీ కోసమే నే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి