అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
అడిగిందానికి చెబుతా ఎంతైనా పందెం గడతా
నిల్చెదనోయి గెల్చెదనోయి ఓహో చిన్నవాడా
ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
గుట్టుగ తన పని సాధించునది .. వివరిస్తావా ఏదది?
అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
కొంగ జపమని ప్రసిద్ధియేను .. ముందుకు వచ్చి కాదను
అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్ గెల్చెదమోయ్ ఓహో చిన్నవాడా
వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
గడియలోననే ఉన్న చోటకే వడిగా చేరేదేదది
అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా
రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను
రాకెట్టని అనుకోను అది స్పుత్నిక్కని అనలేను
ముమ్మాటికి అది మనసేను ఇక.. ముందుకు వచ్చి కాదను
అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్ గెల్చెదమోయ్ ఓహో చిన్నవాడా
దానమిచ్చి చెడె నెవ్వడు
కర్ణుడు... కర్ణుడు
తప్పు తప్పు బలి చక్రవర్తి .. హేయ్ బలిచక్రవర్తి
జూదానికి నిపుణుండెవ్వడు
ధర్మజుడు... ధర్మజుడు
తప్పు తప్పు శకుని.. హేయ్ శకుని
అన్నదమ్ముల పోరాటంలో సందు చూచుకుని కూల్చిందెవడు
భీముడు... భీముడు
తప్పు తప్పు రాముడు
హేయ్ రాముడు.. శ్రీరాముడు.. శ్రీ రాముడు
చిత్రం - ఇల్లరికం (1959)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి