టక్కరిదానా టెక్కులదానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే
టక్కరిదానా టెక్కులదానా
టక్కరిదానా టెక్కులదానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే
తుంటరి రాజా తింటావు కాజా
తుంటరి రాజా తింటావు కాజా
వొంటిగ చేసీ కొంటెగ చూసీ వెంటపడతావా
మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా
యిక బూటకమాడీ నాటకమాడే వాటము చాలోయీ
బూటకమాడీ నాటకమాడే వాటము చాలోయీ
తుంటరి తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు తింటావు కాజా
టక్కరి టక్కరి టక్కరి టక్కరి టక్కరిదానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కులదాన
చీరెలు యిస్తా సారెలు తెస్తా చిరుబురుమనకే
చీరెలు యిస్తా సారెలు తెస్తా చిరుబురుమనకే
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే
టక్కరి టక్కరి టక్కరి టక్కరి టక్కరిదానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కులదాన
చీరెలు యేలా సారెలు యేలా బేరాల మాటేలా
చీరెలు యేలా సారెలు యేలా బేరాల మాటేలా
నే కోరినవాడే చేరువకాగా కొరత యింకేలా
నే కోరినవాడే చేరువకాగా కొరత యింకేలా
తుంటరి తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు తింటావు కాజా
బూరెలు చేస్తా గారెలు చేస్తా బూందీ చేస్తానే
బూరెలు చేస్తా గారెలు చేస్తా బూందీ చేస్తానే
వద్దన్నను మన పెళ్ళికి నేను వడ్డన చేస్తానే
వద్దన్నను మన పెళ్ళికి నేను వడ్డన చేస్తానే
టక్కరిదానా టెక్కులదానా చుక్కలకన్నా
చక్కనిదానా చిక్కాను నీకేనే
చిత్రం - విమల (1960)
సంగీతం - ఎస్ ఎమ్ సుబ్బయ్యనాయుడు
రచన - ముద్దుకృష్ణ
గానం - పిఠాపురం నాగేశ్వరరావు,జమునారాణి
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి