నా వేషాలన్నీ నీకొరకే
నా కొరకా నా కొరకా వేషాలన్నీ నా కొరకా
నీ మోసాలన్నీ నా కొరకా
అడిగిన కోరిక తీరుస్తా నీ అందానికి నే పడిచస్తా
తళతళ మెరిసే ప్రేమపూసలు
దండగట్టి నీ మెళ్ళో వేస్తా
నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే
నా వేషాలన్నీ నీకొరకే
ఎర్రని ఏగాణీ ఎపుడైనా ఇచ్చిన మొగమేనా
చీరలు తెచ్చిన మొగమేనా
ఔనో కాదో కళ్ళు తుడుచుకుని
మొగము చూసుకో అద్దంలోనా
నా కొరకా నా కొరకా వేషాలన్నీ నా కొరకా
నీ మోసాలన్నీ నా కొరకా
చిలకల కొలికి చిరాకుమాని కనికరించవే నా పైని
నీ మనసు నిలపవే నా పైని
నిలువున బంగరు తాడు వేయించి
ఊరేగించెద నా రాణి
ఓహో ఓహో ఓహో ఓహో ఓహో
చాలుర మామా చాలు నీ నక్క వినయములు చాలు
నీ టక్కరి కూతలు చాలు
కల్లలు బొల్లలు దంచావంటే పళ్ళు పదారు రాలు
నీ పళ్ళు పదారు రాలు
ఇహీం ఇహీం ఇహీం ఇహీం
చిత్రం - ఆడపెత్తనం (1958)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల,జిక్కి
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి