నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా
నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా
నిద్దురలోనా ఉలిక్కిపడితే
నిద్దురలోనా ఉలిక్కిపడితే బెదురేదోలే అనుకున్నా
నిద్దురలోనా ఉలిక్కిపడితే బెదురేదోలే అనుకున్నా
చక్కిలిగింతలు పెడితేను చలిగాలెమో అనుకున్నా
చక్కిలిగింతలు పెడితేను చలిగాలెమో అనుకున్నా
కళ్ళు తెరిచి చూశానే నాఎదుటే నువ్వూ ఉన్నావే
కళ్ళు తెరిచి చూశానే నాఎదుటే నువ్వూ ఉన్నావే
నమ్మలేక నీ ఒళ్ళంతా తడిమి తడిమి చూశానే
నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా
చేతికి వెచ్చగ తగిలావు లోపల వేడిని రేపావు
మెల్లగా చెక్కిలి చిదిమాను మెలికలే తిరిగిపోయావు
చేతికి వెచ్చగ తగిలావు లోపల వేడిని రేపావు
మెల్లగా చెక్కిలి చిదిమాను మెలికలే తిరిగిపోయావు
మెలికలుచూసి చెమటలుపోసి పసివాడ్నై పడి పోయాను
మెలికలుచూసి చెమటలుపోసి పసివాడ్నై పడి పోయాను
లేచి చూస్తే నీ ఒడిలో లేవలేక పడుకున్నాను
నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా
నిలబడు నిలబడు నిమిషంసేపు
నిలబడు నిలబడు నిమిషంసేపు నీలికన్నుల చినదానా
నిలబడు నిలబడు నిమిషంసేపు నీలికన్నుల చినదానా
నువ్వూ నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిల్లదానా
నువ్వూ నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిల్లదానా
దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా
దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా
తోవకు అడ్డం పడుకుంటాను
తొక్కైనాపోరాదా.. తొక్కైనాపోరాదా
నిన్నరాత్రి నిన్ను చూస్తి కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా
తెల్లారేకల్లా... హోయ్... తెల్లారేకల్లా
చిత్రం - కన్నతల్లి (1972)
సంగీతం - కె. వి. మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - ఘంటసాల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి