ఈ సొగసైన చినదాని బిగికౌగిలీ చేర
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ వగకాడ బిగువేలరా
కన్ను సైగలు చేసి చేసీ
నా కడకొంగు నునుకేలదూసీ..ఆ ఆఆ ఆ
కన్ను సైగలు చేసి చేసీ
నా కడకొంగు నునుకేలదూసీ
ఎన్నో బాసలు చేసి ఏవో ఆశలు చూపి
ఎన్నో బాసలు చేసి ఏవో ఆశలు చూపి
వింత వింత గిలిగింతచేసి
మరి అంతలోనే మాయమైతివేరా
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆఆ
అర్థ రాతిరి నిదురలేపీ
చెక్కుటద్దంబుపై కేలుమోపీ..ఆ ఆ ఆ
అర్థ రాతిరి నిదురలేపీ
చెక్కుటద్దంబుపై కేలుమోపీ
నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి
నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి
నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి
పొంచి పొంచి కవ్వించువేల
నుడికించనేల చెంతచేర రారా
నుడికించనేల చెంతచేర రారా
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ వగకాడ బిగువేలరా
చిత్రం - తిక్క శంకరయ్య (1968)
సంగీతం - TV.రాజు
గీతరచన - C.నారాయణ రెడ్డి
గానం - :P.సుశీల
సంగీతం - TV.రాజు
గీతరచన - C.నారాయణ రెడ్డి
గానం - :P.సుశీల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి