ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి
ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి .. ఏరా
ఆంజనేయుడికి అన్నదమ్ములం
భీమసేనుడికి పెద్దకొడుకులం .. అద్దిరబన్నా
లోభుల నెత్తిని మొట్టేవాళ్ళం
లోకులకెప్పుడు పెట్టేవాళ్ళం .. అద్దిరబన్నా
ఈ సీమకు మేమే రాజులం అః తిండికి పోతురాజులం
అరె .. సాగితే మహారాజులం
అరె .. చతికిలపడితె తరాజులం
అరె .. చతికిలపడితె తరాజులం
ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి .. ఏరా
చిన్నా పెద్దా బేధం లేదు
కొద్దీ గొప్పా తేడా లేదు.. అద్దిరబన్నా
జుట్టూ జుట్టూ ముడిపెడతాం
చెవులకు తాటాకులు కడతాం .. అద్దిరబన్నా
మా సొంతమన్నదే లేదు .. లేదు
చుప్పనాతులం కాదు .. కాదు
ఎప్పుడు కోపం రాదు .. రాదు
అది వచ్చిందంటే పోదు .. అది వచ్చిందంటే పోదు
ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా
రణశూరులెవ్వరురా భళా భళి .. ఏరా
1 కామెంట్‌లు:
రాజకీయ నాయకులు తమ గురించి పాడుకోగలిగిన పాట 😁😁.
కామెంట్‌ను పోస్ట్ చేయండి