అదే నీవంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఎవ్వరు లేని పువ్వులతోట ఇద్దరు కోరే ముద్దులమూట
ఎవ్వరు లేని పువ్వులతోట ఇద్దరు కోరే ముద్దులమూట
ఎదలో కదలాడె పెదవుల తెరవీడి
చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట .. ఓ..ఓ..ఓ
అదే నీవంటివి అదే నేవింటిని
పున్నమిరేయి పూచిన చోట కన్నులు చేసే గారడి వేట
పున్నమిరేయి పూచిన చోట కన్నులు చేసే గారడి వేట
చూపులు జతచేసి ఊపిరి శ్రుతిచేసి
తనువే జిల్లన కవ్వించిన ఆ మాట .. ఓ..ఓ..ఓ
అదే నీవంటివి అదే నేవింటిని
నిన్నూ నన్నూ కలిపిన బాట నీలో నాలో పలికిన పాట
నిన్నూ నన్నూ కలిపిన బాట నీలో నాలో పలికిన పాట
జాబిలి సిగ్గిలగా కౌగిలి దగ్గరగా
మనసే ఝల్లన చిలికించిన ఆ మాట .. ఓ..ఓ.. ఓ
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
చిత్రం - సప్తస్వరాలు (1969)
సంగీతం - టి.వి.రాజు
గీతరచన - సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి