ఓ సుకుమారా.. నను జేరా రావోయీ..ఇటు రావోయీ
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే
ఓ సుకుమారా.. నను జేరా రావోయీ..ఇటు రావోయీ
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే
ఓ జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయీ.
కనువుగ నేడూ నీ చెలికాడూ నీ దరినే సుఖించునులే
కోటి కిరణముల కోరినగానీ
భానుని చూడదు కలువ చెలీ
కోటి కిరణముల కోరినగానీ
కోటి కిరణముల కోరినగానీ
భానుని చూడదు కలువ చెలీ
వెన్నెల కాంతీ వెలిగిన వేళా .. వెన్నెల కాంతీ వెలిగిన వేళా
విరియునుగా విలాసముగా
నిలువగ లేనీ వలపుల రాణీ నీ కొరకే తపించునులే
వేయి కనులతో వెదకినగాని
తారకు జాబిలి దూరమెగా
వేయి కనులతో వెదకినగాని
వేయి కనులతో వెదకినగాని
తారకు జాబిలి దూరమెగా
కలువల రాణీ వలపులలోనే .. కలువల రాణీ వలపులలోనే
కళకళలాడి చేరునుగా
కనువుగ నేడూ నీ చెలికాడూ నీ దరినే సుఖించునులే
చిత్రం - భార్యాభర్తలు ( 1961)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు
గీతరచన - శ్రీ శ్రీ
గానం - ఘంటశాల, సుశీల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి