మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండగలే ఈ రోజు
మనదే మనదేలే ఈ రోజూ
మన కందరికీ పండగలే ఈ రోజు
ఆశలు పండీ ఆకలి తీరి
బ్రతుకులు మారే పండుగరోజు
మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండుగలే ఈ రోజు
గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు
గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు
జబ్బ చరిచిన రోజు... రొమ్ము విరిచిన రోజు
మనం గెలిచిన రోజు
మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండగలే ఈ రోజు
కూలి యజమాని తేడాలె వుండవు
ఈ కులాల ఈ మతాల గొడవలుండవు
అందరిదొకటే మాట అందరిదొకటే బాట
అందరిదొకటే మాట అందరిదొకటే బాట
ఇకపై చూడు బరాటా
పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు
సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు
పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు
సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు
ఇది సామ్యవాదయుగం... ఇటే నడుస్తుంది జగం
ఇక ఆగదులే ఆగదులే జగన్నాధ రథం
హోయ్.. మనదే మనదేలే ఈ రోజూ
మన కందరికీ పండగలే ఈ రోజు
ఆశలు పండీ ఆకలి తీరి
బ్రతుకులు మారే పండుగరోజు
మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండుగలే ఈ రోజు
హోయ్...హోయ్...హోయ్...హోయ్...హోయ్...
చిత్రం - మైనరు బాబు (1973)
సంగీతం - టి చలపతిరావు
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - బాలు, సుశీల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి