ఈ మౌనం... ఈ బిడియం...
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె ...
మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ...
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ ... ఓహొ... ఆ....ఆ...
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరికా
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతికా .
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే...
ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయికా
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...

చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల










