30, ఆగస్టు 2018, గురువారం

గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింప రావేలరాగోపాల జాగేలరా .. బాలగోపాల జాగేలరా
నన్ను లాలించి పాలింప రావేలరా


చిత్రం - భలే అమ్మాయిలు(1957)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు,ఎస్. హనుమంతరావు
గీతరచన - సదాశివబ్రహ్మం
గానం - ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల
 

28, ఆగస్టు 2018, మంగళవారం

చక చక ఝణతా తకధిమి కిటతాచక చక ఝణతా తకధిమి కిటతా 
 పకపకా నవ్వుతా పంతమాడతాచిత్రం - భలే అమ్మాయిలు (1957)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు,ఎస్. హనుమంతరావు
గీతరచన - కొసరాజు రాఘవయ్య
గానం - జిక్కి బృందం 

26, ఆగస్టు 2018, ఆదివారం

ఓహో బంగరు చిలుక ఆహా ఎందుకే అలకఓహో బంగారు చిలుక ఆహా ఎందుకే అలక
ఇలా చూడవు మాటాడవు మోమాటమా


చిత్రం - భలే అమ్మాయిలు (1957)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు ,ఎస్. హనుమంతరావు
గీతరచన - సదాశివబ్రహ్మం
గానం - జిక్కి 

25, ఆగస్టు 2018, శనివారం

నిలువుమా నిలువుమా నీలవేణీనిలువుమా నిలువుమా నీలవేణీ
నీ కనుల నీలినీడ నా మనసు నిదుర పోనీ
చిత్రం - అమరశిల్పి జక్కన్న(1964)
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు
గీతరచన - సముద్రాల రాఘవాచార్య
గానం - ఘంటసాల, పి.సుశీల

24, ఆగస్టు 2018, శుక్రవారం

ఆనందాలే నిండాలి అనురాగాలే పండాలిఆనందాలే నిండాలి అనురాగాలే  పండాలి 
అందరు ఒకటై ఉండాలిచిత్రం - కుటుంబగౌరవం (1957)
సంగీతం - విశ్వనాథన్,రామమూర్తి 
గీతరచన - అనిశెట్టి సుబ్బారావు
గానం - ఎస్. జానకి, పి.లీల, పిఠాపురం నాగేశ్వరరావు

23, ఆగస్టు 2018, గురువారం

గిరిజా కళ్యాణం - రహస్యంగిరిజా కళ్యాణం - రహస్యంఅంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు

ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా
బహుపరాక్ బహుపరాక్
చండభుజాయమండల దోధూయమాన వైరిగణా షడాననా
బహుపరాక్ బహుపరాక్

మంగళాద్రి నారసింహ బంగరుతల్లి కనకదుర్గ
బహుపరాక్ బహుపరాక్
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ
బహుపరా.....క్

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా
లలితకళల విలువ తెలియు సరసులు
పదింపదిగ పరవశమయ్యే
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా

ఈశుని మ్రోల హిమగిరి బాల
ఈశుని మ్రోల హిమగిరి బాల కన్నెతనము ధన్యమయిన గాథ
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ.. ఆ కోపీ
తాపముతీరి కనుతెరిచి తను తెలిసీ
తన లలనను పరిణయమాడిన ప్రబంధము
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా

రావో రావో లోల లోల లోలం బాలక రావో
రావో రావో లోల లోల లోలం బాలక రావో
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి
రాజ సులోచన రాజాననా
రావో రావో లోల లోల లోలం బాలక రావో

చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే
మానస సరసినీ మణిపద్మ దళముల
రాణించు అల రాజ హంస సన్నిధికే

వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే
కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అల దేవ దేవు సన్నిధికే

తగదిది తగదిది తగదిది
ధరణీ ధర వర సుకుమారీ
తగదిది తగదిది తగదిది
 
అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా
నిను బోలిన కులపావని తానై
వరునరయగ బోవలెనా ...ఆ..ఆ..

తగదిది తగదిది తగదిది ధరణీ ధర వర సుకుమారీ
తగదిది

కోరినవాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి నీ దాసు చేయనా

తగదిది తగదిది తగదిది ధరణీ ధర వర సుకుమారీ
తగదిది

ఈశుని దాసుని చేతువా అపసద అపచారము కాదా
కోలల కూలెడు అలసుడు కాడూ ఆదిదేవుడే అతడూ
సేవలు చేసి ప్రసన్నుని చేయ
నా స్వామి నన్నేలు నోయీ నీ సాయమే వలదోయీ
ఈశుని దాసుని చేతువా

కానిపనీ మదనా కాని పనీ మదనా
అది నీ చేతకానిపనీ మదనా
అహంకరింతువ హరుని జయింతువ
అది నీ చేతకాని పని మదనా కానీపనీ మదనా

చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
వినకపోతివా ఇంతటితో .. వినకపోతివా ఇంతటితో
నీ విరిశరముల పని సరి సింగిణి పని సరి
తేజోపని సరి చిగురికి నీ పని సరి మదనా

చిలుక తత్తడి రౌత ఎందుకీ హూంకరింతా
చిలుక తత్తడి రౌతా

సామగ సాగమ సాధారా శారద నీరద సాకారా
దీనా ధీనా ధీసారా .. సామగ సాగమ సాధారా
ఇవె కైమోడ్పులు ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి ఈశా మహేశా

సామగ సాగమ సాధారా
దీనా ధీనా ధీసారా .. సామగ సాగమ సాధారా

విరులన్ నిను పూజచేయగా విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ
కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
మరుడే పున రూపున వర్థిలుగా
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ.. ప్రభూ.. పతిభిక్ష ప్రభూ

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని నను పిలిచెను వినవో

మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేకొనవో
శరణం భవ శరణం భవ శరణం భవ స్వామీ
పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం స్వామీ

బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం
జగమేలు తండ్రికి జయమంగళం
విరులచే వరునిచేకరముచేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం
జగమేలు తల్లికి జయమంగళం

కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవా 
శ్రీ వేణుగోపాలా జయ మంగళం
త్రైలోక్య మందారా శుభమంగళంచిత్రం -రహస్యం (1967)
సంగీతం - ఘంటసాల
గీతరచన - మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం - ఘంటసాల,బృందం

22, ఆగస్టు 2018, బుధవారం

పాడవోయి రైతన్నా ఆడవోయి మాయన్నాపాడవోయి రైతన్నా ఆడవోయి మాయన్నా
పంటలింటి కొచ్చే నేడే పండుగ చిత్రం - కుటుంబగౌరవం (1957)
సంగీతం - విశ్వనాథన్,రామమూర్తి 
గీతరచన - అనిశెట్టి సుబ్బారావు 
గానం - పిఠాపురం నాగేశ్వరరావు,సత్యవతి,D. L. రాజేశ్వరి


21, ఆగస్టు 2018, మంగళవారం

అందాల బొమ్మతో ఆటాడవా ..అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీచిత్రం - అమరశిల్పి జక్కన (1964)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - దాశరథి
గానం - P.సుశీల

20, ఆగస్టు 2018, సోమవారం

చల్లని సంసారం అనురాగసుధా సారంచల్లని సంసారం అనురాగసుధా సారం
హాయగు కాపురం అదే  సంతోషపు తీరం

చిత్రం - కుటుంబగౌరవం (1957)
సంగీతం - విశ్వనాథన్,రామమూర్తి 
గీతరచన - అనిశెట్టి సుబ్బారావు 
గానం - పి.లీల 

19, ఆగస్టు 2018, ఆదివారం

బాలనురా మదనా ..బాలనురా మదనా
విరి తూపులు వేయకురా .. మదనా
చిత్రం - మిస్సమ్మ (1955)
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు 
గీతరచన -  పింగళి నాగేంద్రరావు
గానం - పింగళి నాగేంద్రరావు


18, ఆగస్టు 2018, శనివారం

అల్లీ బిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెబుతాముఅల్లీ బిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెబుతాము 
చక చక్కని జోస్యం చెబుతాము


చిత్రం - మాయాబజార్ (1957)
సంగీతం -  ఘంటసాల, సాలూరు రాజేశ్వరరావు 
గీతరచన - పింగళి నాగేంద్రరావు
గానం - పి.లీల,బృందం 

17, ఆగస్టు 2018, శుక్రవారం

జేబులో బొమ్మ జేజేల బొమ్మజేబులో బొమ్మ జేజేల బొమ్మ
జేబులో బొమ్మ ...


చిత్రం - రాజు పేద (1954)
సంగీతం - సాలూరి రాజేశ్వర రావు
గీతరచన - కొసరాజు రాఘవయ్య 
గానం - ఘంటసాల


16, ఆగస్టు 2018, గురువారం

సుందరి నీవంటి దివ్య స్వరూపము ..సుందరి నీవంటి దివ్య స్వరూపము 
ఎందెందు వెదకిన లేదు కదా


చిత్రం - మాయాబజార్ (1957)
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల
గీతరచన - పింగళి నాగేంద్రరావు
గానం -ఘంటసాల, సావిత్రి


15, ఆగస్టు 2018, బుధవారం

శ్రీ నగజా తనయం సహృదయంశ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయంశ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం...

శ్రీరామ భక్తులారా ఇది సీతా కళ్యాణ సత్కథ 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట
చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత  కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతం ఏర్పడినట్లు తోస్తుంది.
నాయనా... కాస్త పాలు మిరియాలు ఏవైనా...

చిత్తం .. సిద్ధం

భక్తులారా సీతామహాదేవి స్వయంవరానికి
ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో
అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి
ఆహ్హా .. అతడెవరయ్యా అంటే

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు

వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాలు జాలురా
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాలు జాలురా

వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు

సనిదని సగరిగరిగరిరి సగరిరిగరి సగగరిసనిదని
సగగగరిసనిదని రిసనిద రిసనిద నిదపమగరి రఘురాముడు

ఔను ఔను

సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస సనిరిసనిదని నిదసనిదపమ గా మా దా
నినినినినినిని పస పస పస పస
సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు

ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగటనున్న చెలికత్తెతో

ఎంత సొగసుగాడే ... ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే
మోము కలువఱేడే.. మోము కలువఱేడే
నా నోము ఫలము వీడే శ్యామలాభిరాముని చూడగ
నామది వివశమాయె నేడే ఎంత సొగసు గాడే
ఎంత సొగసుగాడే

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా
అక్కడ స్వయంవర సభామంటపంలో
జనక మహీపతి సభాసదులను జూచి

అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగుపుత్రి సీత
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత
జలజాతముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును
నేడుమక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడూ...

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా "హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున...

ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిక  చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత

ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము
ఒక నిమేషమ్ము నందే నయము జయమును భయము విస్మయము గదురా
ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...

భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది
మరొక్కసారి ...
జై .. శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులారా .. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట

భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్
భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్

శ్రీ మద్రమారమణ గోవిందో హరి 


 చిత్రం - వాగ్ధానం (1961)
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచన - శ్రీరంగం శ్రీనివాసరావు
గానం -  ఘంటసాల వెంకటేశ్వరరావు
  

14, ఆగస్టు 2018, మంగళవారం

రేగిన ఆశ తీవలు సాగెను ఊగేవులే సుమ డోలికారేగిన ఆశ తీవలు సాగెను  ఊగేవులే సుమ డోలికా
తూగేవులే సుఖ డోలికా చిత్రం - చరణదాసి(1956)
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు
గీతరచన - సముద్రాల
గానం - జిక్కి


13, ఆగస్టు 2018, సోమవారం

నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మదినీ పేరు విన్నా నీ రూపు కన్నా 
ఉయ్యాలలూగు మది .... సై  సై  సైSunte The Naam Hum - Aah (1953)చిత్రం - ప్రేమలేఖలు (1953)
సంగీతం - శంకర్ జై కిషన్ 
గీతరచన - ఆరుద్ర 
గానం - జిక్కి


12, ఆగస్టు 2018, ఆదివారం

గులాబీల తావులీనే కులాసాల జీవితాలగులాబీల తావులీనే కులాసాల జీవితాల  
విలాసాలివే .. వికాసాలివేచిత్రం - చరణదాసి (1956)
సంగీతం - యస్.రాజేశ్వర రావు
గీతరచన - సముద్రాల రాఘవాచార్య
గానం - ఘంటసాల, పి.లీల

11, ఆగస్టు 2018, శనివారం

పందిట్లో పెళ్లవుతున్నది కనువిందవుతున్నదిపందిట్లో పెళ్లవుతున్నది కనువిందవుతున్నది 
నటనమే ఆడెదను… ఓ… నటనమే ఆడెదనుRaja Ki Aayegi Baraat - Aah(1953) చిత్రం - ప్రేమలేఖలు (1953)
సంగీతం - శంకర్ జై కిషన్ 
గీతరచన - ఆరుద్ర 
గానం - జిక్కి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...