చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
ప్రియురాలి మదిలో ఏముందో
తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా..
చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను
నిలుపుకుందురా వెలుగులమేడ..
నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకుందునే పూల ఉయ్యాల
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
ప్రియురాలి మదిలో ఏముందో
తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా..
చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను
నిలుపుకుందురా వెలుగులమేడ..
నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకుందునే పూల ఉయ్యాల










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి